blood donation camp at jagithyala on the occassaion of Naitional press day
జగిత్యాల: జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆదేశాలతో టిఎస్జేయూ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డా. పేట భాస్కర్, ప్రధాన కార్యదర్శి జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హనుమాండ్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించి పాత్రికేయుల సమస్యలపై పోరాడడం జరిగిందని అన్నారు. తమ పార్టీ పక్షాన రానున్న కాలంలో జర్నలిస్టులకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అనేక రాయితీలు కల్పించడం జరుగుతుందని , ప్రభుత్వ ఆదరణ లేక జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని వ్యవస్థ పై పూర్తి పరిజ్ఞానం ఉన్న తీన్మార్ మల్లన్న జర్నలిస్టులకు న్యాయం చేయగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దీకొండ మురళి, మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మెన శ్రీహరి, జెంజరి గంగాధర్, గట్ల శ్రీనివాస్ వివిధ సంఘాల నాయకులు ఎలిశేట్టి గంగారెడ్డి, నల్ల శ్యాం, ఎస్ రాజయ్య, గజ్జెల రాజు, సుంకర పల్లి అశోక్, బ్లడ్ బ్యాంకు మెడికల్ అధికారి డాక్టర్ గీతిక, టెక్నికల్ స్టాఫ్ సి హెచ్ రాజేందర్, వేణుగోపాల్, నర్సింగ్ అధికారులు ఈ.దివ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.