National Pressday TSJU WarangalMuncipal comissioner Chahath Bajpai inaugurated helath camp at warangal
  • పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు
  • టీఎస్ జేయు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం
  • గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
  • టి.ఎస్.జే.యు ఆధ్వర్యంలో ఉచిత వైద్య, నేత్ర పరీక్ష మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు

వరంగల్: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి వాసవి కాలనీలో గల ఇన్నర్ వీల్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవాన్ని (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య, నేత్ర పరీక్ష మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(టి.ఎస్.జే.యు) వరంగల్ జిల్లా బాధ్యులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛకు, పరిధికి భంగం కలిగించేలా ఎవరూ కూడా ప్రవర్తించకూడదని అన్నారు. అలాగే సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి సమాజాభివృద్ధికి ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టు వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. వృత్తి బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతగా టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అంటూ జర్నలిస్టులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎస్ జేయు వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి మాట్లాడుతూ టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి అనిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో టీఎస్ జేయు అన్నివేళలా ముందుంటుందని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లకు అతీతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జర్నలిస్టులందరికీ టీఎస్ జేయు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజెపి జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, మట్వాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఏజే మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు, వరంగల్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గజ్జె గోవర్ధన్, టీఎస్ జె యు రాష్ట్ర నాయకులు నాగరాజు,నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, గంగరాజు, కృష్ణ, కోశాధికారి సత్యం, కార్యవర్గ సభ్యులు అవినాష్ శ్రీహరి, సురేష్, రాజు, అశోక్, డా.దయాకర్ వైద్య బృందం, ఎంజీఎం బ్లడ్ బ్యాంకు సిబ్బంది, శరత్ ఐ హాస్పిటల్ సిబ్బంది మరియు జర్నలిస్టులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *